![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మధ్యాహ్నం మెగాస్టార్స్ వెర్సస్ సాయంత్రం సూపర్ స్టార్స్ అనే కాన్సెప్ట్ ని శ్రీముఖి తీసుకొచ్చింది. అలాగే ఈ షోకి బ్రహ్మానందం ఆయన కొడుకు వచ్చారు. వీళ్ళు "బ్రహ్మా ఆనందం" అనే మూవీలో నటించాడు. ఇక ఈ షోలో శ్రీముఖిని బ్రహ్మానందం బాగా ఆడేసుకున్నారు. శ్రీముఖి రాగానే బ్రహ్మానందం కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుంది. "మీ బ్లెస్సింగ్స్ తర్వాత అన్నా పెళ్లి అవ్వాలి అని కోరుకుంటున్నా" అంది శ్రీముఖి. దానికి బ్రహ్మానందం "ఎప్పటిలోపు పెళ్లి చేసుకోవాలని ఉందో చెప్పు" అని అడిగారు. "వయసైపోతోంది కదా పెళ్లి చేసేసుకో చేసేసుకో అంటున్నారు అందుకే" అని శ్రీముఖి నసిగింది.
"అందరూ అనుకుంటున్నారు కానీ నువ్వు అనుకోవట్లేదు కదా" అని గట్టిగానే కౌంటర్ ఇచ్చేసారు. దానికి శ్రీముఖి షాక్ అయ్యింది. ఇక ప్రోమో ఫైనల్ లో బ్రహ్మానందానికి చిరు సత్కారం చేశారు. హరి, అవినాష్ ఇద్దరూ కలిసి బ్రహ్మానందం కాళ్ళు కడిగారు. అలాగే డాక్టర్ బాబు, అవినాష్ కలిసి ఆయనకు షాల్ కప్పింది. "సజీవ నదిలా సాగిపోయే ఒక అందమైన సినిమా...దానిలో ప్రయాణించిన ప్రతీ ఒక్కరికీ చక్కని గమ్యం దొరుకుతుంది." అని చెప్పుకొచ్చారు. ఇక గౌతమ్ మాట్లాడుతూ "తనకు అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ తాత అంటే ఎలా ఉంటాడో తెలీదు. కానీ ఈ మూవీతో ఆ కోరిక తీరిపోయింది. అలాగే ఈ మూవీ మొత్తం నాన్నతో కలిసి బాగా ఎంజాయ్ చేశా" అని చెప్పుకొచ్చాడు. గౌతమ్ 2004లో పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది. ఆ తర్వాత 2011 లో వారెవా, 2014 లో బసంతి, 2016 లో చారుశీల, 2018 లో మను లాంటి చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ సినిమాలేవీ కమర్షియల్ గా హిట్ కాలేదు.
![]() |
![]() |